AP:అమరావతి రైతుల పాదయాత్ర..కారణం ఏంటంటే?

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఈ ఎన్నికల్లో మళ్లీ అధికారం తమదే అని ధీమాతో ఉన్న వైసీపీ ఘోర పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే.

Update: 2024-07-14 11:30 GMT

దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఈ ఎన్నికల్లో మళ్లీ అధికారం తమదే అని ధీమాతో ఉన్న వైసీపీ ఘోర పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో దీక్ష విరమించిన అమరావతి రైతులు గత నెల 24న అమరావతి వెంకటపాలెం నుంచి తిరుమలకు పాదయాత్రగా బయలుదేరారు. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మూడు రాజధానుల ప్రకటనను వ్యతిరేకిస్తూ 30 మంది అమరావతి రైతులు ‘న్యాయస్థానం టూ దేవస్థానం’ పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్ర నిన్న(శనివారం) తిరుమలకు చేరుకుంది. 17 రోజులుగా 433 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించి శనివారం తిరుపతికి చేరుకున్నారు. ఆదివారం అలిపిరి కాలి బాటలో తిరుమలకు చేరుకుంటారు అనంతరం సోమవారం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని శ్రీవారికి మొక్కులు చెల్లించనున్నారు.


Similar News