జీతాలు పెంచండి మహాప్రభో.. అంబేద్కర్ విగ్రహానికి వీఆర్ఏల మెుర

ఉద్యోగాల్లో ప్రమోషన్లు, జీతం పెంపు వంటి పలు దీర్ఘకాలిక డిమాండ్లపై వీఆర్ఏలు గత కొంతకాలంగా ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 14న కూడా వీఆర్ఏలు నిరసన తెలిపారు..

Update: 2023-04-14 10:35 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఉద్యోగాల్లో ప్రమోషన్లు, జీతం పెంపు వంటి పలు దీర్ఘకాలిక డిమాండ్లపై వీఆర్ఏలు గత కొంతకాలంగా ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 14న కూడా వీఆర్ఏలు నిరసన తెలిపారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో నరసాపురం డివిజన్‌ పరిధి పలు ప్రాంతాలలో డా.బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు అందజేశారు. పాలకొల్లు, యలమంచిలి, పోడూరు మండలాలకు చెందిన వీఆర్‌ఏలు పాలకొల్లు అంబేద్కర్‌ విగ్రహం వద్ద తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ వినతిపత్రం అందజేశారు. నామినీగా పని చేస్తున్న వీఆర్‌ఏల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వీఆర్‌ఏల కనీస వేతనం రూ.26,000కు పెంచాలని, వీఆర్‌ఏలకు ఇంటర్మీడియట్‌‌తో ప్రమోషన్‌ కల్పించాలని ఈ సందర్భంగా వీఆర్ఏలు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నర్సాపురం డివిజన్‌ వీఆర్‌ఏల సంఘం అధ్యక్షులు మోటూరి మోషే ఇతర వీఆర్ఏలు పాల్గొన్నారు.

Also Read..

జగనన్న లే ఔట్లకే ప్రిఫరెన్స్.. కలగా సొంతిల్లు..! 

Tags:    

Similar News