ఆ నీరు కలుషితం కాలేదు.. అవి అనారోగ్య మరణాలే..!
విజయవాడ మొగల్రాజుపురం ఘటనపై వీఎంసీ స్వప్నిల్ దినకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు...
దిశ, వెబ్ డెస్క్: విజయవాడ మొగల్రాజపురంలో డయేరియాతో నలుగురు మృతి చెందారు. మరో 100 మందికి పైగా ఆస్పత్రి పాలయ్యారు. ప్రధానంగా మంచి నీరు కలుషితం కావడం వల్లే మొగల్రాజపురం వాసులు అస్వస్థతకు గురయ్యారనే ఆరోపణలు వినిపించాయి. ఈ ఆరోపణలపై విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దికర్ స్పందించారు. తాగునీరు కాలుషితం కావడమనేది అవాస్తమని చెప్పారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సురక్షిత నీటిని ప్రజలకు సరఫరా చేస్తోందన్నారు. మంచినీరు తాగి ఎవరూ మృతి చెందలేదని తెలిపారు. అనారోగ్యంతోనే నలుగురు మృతి చెందారని స్పష్టం చేశారు. మొగల్రాజపురంలో నీరు కలుషితమైనట్లు తమకు ఫిర్యాదు వచ్చాయని తెలిపారు. మూడు రకాల పరీక్షలు చేశామని, ఎక్కడా హానికరం లేదని రిపోర్టు వచ్చిందని దినకర్ తెలిపారు. మొగల్రాజపురంలో ప్రతి ఇంటికి వెళ్లి హెల్త్ సర్వే చేశామన్నారు. నీళ్లలో కోరిన్ కలిపినప్పుడు రంగు మారుతుందని చెప్పారు. పైప్ లైన్ లీకేజీలు సహజమేనని, వాటిని గుర్తించి చర్యలు చేపట్టామని విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పేర్కొన్నారు.