పీ-4 గోడ పత్రిక ఆవిష్కరణ.. అభిప్రాయాలు తెలిపేందుకు లాస్ట్ డేట్ ఇదే!

జీరో పావర్టీ పీ-4 గోడ పత్రికను సోమవారం కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆవిష్కరించారు.

Update: 2025-03-17 14:38 GMT
పీ-4 గోడ పత్రిక ఆవిష్కరణ.. అభిప్రాయాలు తెలిపేందుకు లాస్ట్ డేట్ ఇదే!
  • whatsapp icon

దిశ ప్రతినిధి, ఏలూరు: జీరో పావర్టీ పీ-4 గోడ పత్రికను సోమవారం కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ.. సమగ్రాభివృద్ధి లక్ష్యంగా స్వర్ణాంధ్ర - 2047లో భాగంగా పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు పి-4 విధానం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం ఈనెల 25వ తేదీలోపు https://swarnandhra.ap.gov.in/p4 వెబ్ సైట్లో ప్రజలు తమ విలువైన అభిప్రాయాలు తెలుపవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు, సిపివో వాసుదేవరావు, ఆర్డివో అచ్యుత అంబరీష్, డిఆర్డిఏ పిడి ఆర్. విజయరాజు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె. భాస్కర్, ఎస్ఓ జె. రాజశేఖర్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


Similar News