Palakollu: వ్యవసాయ సహకార వ్యవస్థకు మహర్దశ

రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు త్వరలోనే మహర్దశ పట్టనుంది.

Update: 2025-01-21 02:05 GMT
Palakollu: వ్యవసాయ సహకార వ్యవస్థకు మహర్దశ
  • whatsapp icon

దిశ, పాలకొల్లు: రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు త్వరలోనే మహర్దశ పట్టనుంది. రాష్ట్రంలో 2500 కు పైబడి సహకార సంఘాలు పనిచేస్తున్నాయి. వీటన్నిటినీ కేంద్ర ప్రభుత్వం బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. ఇందుకోసం ఇప్పటికే కంప్యూటరీకరణ చేపట్టిన విషయం తెలిసిందే. సహకార సంఘాల్లోని సిబ్బంది ఇప్పటికే కంప్యూటరీకరణ పనుల్లో బిజీ అయిపోయారు. ఈ పనులు త్వరలోనే పూర్తికానున్నాయి.

ప్రభుత్వ రంగ బ్యాంకులకు దీటుగా..

రాబోయే కాలంలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థలకు దీటుగా పనిచేయనున్నాయి. ఇందుకోసమే సహకార సంఘాలను కంప్యూటరీకరణ చేస్తున్నారు. దీనివల్ల సహకార సంఘాల్లో జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ కంప్యూటరీకరణ జరిగి పారదర్శకంగా ఉంటుందని అందువల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకులతో సమానంగా లావాదేవీలు ఉంటాయని అంటున్నారు. డిపాజిట్లు బాగా పెరిగి బ్యాంకింగ్ బిజినెస్ బాగా పెరుగుతుందని, తద్వారా అధిక లాభాలు బాట పడతాయని అంటున్నారు. ఉద్యోగుల బదిలీలు కూడా ఉంటాయని అంటున్నారు. అలాగే ఇప్పుడు కొన్ని సొసైటీలో సీఎస్సీ సెంటర్లు ప్రారంభించిన విషయం తెలిసిందే. రాబోయే కాలంలో అన్ని సహకార సంఘాల్లోనూ సీఎస్సీ సెంటర్లు ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. వీటి ద్వారా కూడా ఆదాయం పొందుతాయని అంటున్నారు.

Tags:    

Similar News