Ap News: కల్తీ మద్యంపై కదంతొక్కిన బీజేపీ నారీమణులు

ఏపీలో కల్తీ మద్యంపై బీజేపీ మహిళనేతలు కదం తొక్కారు....

Update: 2023-09-21 13:54 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కల్తీ మద్యంపై బీజేపీ మహిళనేతలు కదం తొక్కారు. ఆ పార్టీ చీఫ్ పురంధేశ్వరి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద నిరసన వ్యక్తం చేశారు. మద్య బాటిళ్లను ధ్వంసం చేశారు. కల్తీ మద్యంతో ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. కాగా కల్తీ మద్యం తాగి పలువురు అస్వస్థతకు గురయ్యారు. వీరికి నరసాపురం ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారు. దీంతో వారిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పరామర్శించారు. 

ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్మకాలకు సంబంధించి ఎలాంటి బిల్లులు ఇవ్వడంలేదని తెలిపారు. రాష్ట్రంలో మద్యం పేరుతో కుంభకోణం జరుగుతోందని ఆమె ఆరోపించారు. మద్యంపై వస్తున్న ఆదాయం వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్తోందని మండిపడ్డారు. రాష్ట్ర బడ్జెట్‌లో మద్యం ద్వారా 20 వేల కోట్ల ఆదాయం వస్తోందని చెప్పారు. వాస్తవానికి రూ.56700 కోట్ల ఆదాయం వస్తోందని ఆరోపించారు. మరి మిగిలిన 36,700 కోట్ల సొమ్ము ఎటుపోతోందని పురంధేశ్వరి ప్రశ్నించారు.

Tags:    

Similar News