పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ఇంట్లో పెళ్లి...హాజరైన చంద్రబాబు
ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతుంది.
దిశ, డైనమిక్ బ్యూరో : ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతుంది. ఉరవకొండ నియోజకవర్గం కౌకుంట్ల గ్రామంలో టీడీపీ సీనియర్ నేత,పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ కుమారుడు విక్రమ్ వివాహ రిసెప్షన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన దంపతులు విక్రమ్ -లోహితను చంద్రబాబు ఆశీర్వదించారు. ఈ రిసెప్షన్‌కు తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రముఖులు హాజరయ్యారు.