ఏపీకి బిగ్ అలర్ట్.. రెండు రోజుల పాటు ఈ జిల్లాల్లో భారీ వర్షం..!

ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి వాతావరణ కేంద్రం బిగ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో రెండు రోజుల పాటు మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే

Update: 2024-06-30 13:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి వాతావరణ కేంద్రం బిగ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో రెండు రోజుల పాటు మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా కోస్తా ప్రాంతంలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. వర్షాల నేపథ్యంలో తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే చాన్స్ ఉందని, ఈ సమయాల్లో ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇండ్ల నుండి బయటకు రావొద్దని అలర్ట్ చేసింది. మత్స్యకారులు రెండు రోజుల పాటు సముద్రంలో వేటకు వెళ్లొద్దని వాతావరణశాఖ హెచ్చరించింది. భారీ వర్షాలు కురువనున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖను అప్రమత్తం చేసింది. 

Similar News