వైసీపీ ఓటమికి అసలు కారణం అదే.. కీలక విషయం బయటపెట్టిన CPI నారాయణ

వైసీపీ ఓటమిపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన

Update: 2024-07-02 10:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ఓటమిపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విషయంలో స్పష్టమైన వైఖరి స్పష్టం చేయనుందుకే వైసీపీ ఓటమి పాలైందని అభిప్రాయం వ్యక్తం చేశారు. బీజేపీకి మద్దతు ఇస్తున్నామా..? లేదా అనే విషయాన్ని జగన్ ప్రజలకు స్పష్టంగా చెప్పకుండా న్యూట్రల్‌గా వ్యవహరించారని.. ఈ కారణంగానే వైసీపీ ఘోరంగా ఓడిపోయిందని అన్నారు. బీజేపీ విషయంలో వైసీపీ వైఖరి ఏంటో ప్రజలతో పాటు ఆ పార్టీ కార్యకర్తలకు కూడా క్లారిటీ లేదన్నారు.

సాధారంణంగా బీజేపీకి దూరంగా ఉండే క్రిస్టియన్, మైనార్టీ ఓటు బ్యాంక్ ఎక్కువగా కల్గిన వైసీపీ.. కాషాయ పార్టీ విషయంలో తమ స్టాండ్ ఏంటో సరిగ్గా చెప్పకపోవడం వలన ఆ పార్టీకి భారీ డ్యామేజీ జరిగిందని అన్నారు. పైకి బీజేపీకి దూరంగా ఉంటున్నట్లు నటించిన.. లోపల మాత్రం వైసీపీ ఆ పార్టీకి మద్దతు ఇచ్చిందని.. ఇదే విషయాన్ని ప్రజలకు స్పష్టంగా చెప్పలేదన్నారు. రాజకీయాల్లో స్పష్టమైన వైఖరి అనేది చాలా ముఖ్యమని వైసీపీకి సూచించారు. ఇక, అసెంబ్లీలో తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ స్పీకర్‌కు జగన్ రాసిన లేఖపైన నారాయణ రెస్పాండ్ అయ్యారు. అసెంబ్లీ‌లో ప్రతిపక్ష హోదా గెలిచిన సీట్లను బట్టి వస్తుందని, ఓటింగ్ శాతాన్ని బట్టి కాదని కౌంటర్ ఇచ్చారు. ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా అప్పుల పాలు చేయడంతోనే వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం అయ్యిందని విమర్శించారు.  

Similar News