విశాఖ సెంట్రల్ జైలును సందర్శించిన హోంమంత్రి అనిత

ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత మంగళవారం విశాఖపట్టణంలోని సెంట్రల్ జైలును సందర్శించారు. అనంతరం అధికారులో చర్చించిన మంత్రి.. మీడియాతో మాట్లాడారు.

Update: 2024-07-02 10:41 GMT

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత మంగళవారం విశాఖపట్టణంలోని సెంట్రల్ జైలును సందర్శించారు. అనంతరం అధికారులో చర్చించిన మంత్రి.. మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 800 మంది ఖైదీల సామర్థ్యం ఉన్న విశాఖ సెంట్రల్ జైల్లో ఏకంగా 2000 మందిని ఉంచారన్నారు. ముఖ్యంగా ఈజీ మనీకి అలవాటుపడి గంజాయి సరఫరా చేస్తూ.. 1200 మంది యువకులు పోలీసులకు పట్టుబడ్డారని.. వారంతా ప్రస్తుతం జైలులో శిక్ష అనుభవిస్తున్నారని,, వారిలో చాలా మందికి బెయిల్ వచ్చినప్పటికి షూరిటీ లేకపోవడంతో జైల్లోని మగ్గిపొతున్నట్లు తెలిపారు. అలాగే ఈ విషయంపై హోం సెక్రటరీ తో మాట్లాడి వారిని విడిపించేందుకు ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేస్తామని హోంమంత్రి అని తెలిపారు. అలాగే త్వరలోనే జైల్లలో డి-అడిక్షన్ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. గంజాయి, డ్రగ్స్ విషయంలో రాజకీయ జోక్యం ఉండదని.. ఎవరైనా రాజకీయ నేతలు పోలీసులపై ఒత్తిడి చేస్తే తన దృష్టికి తీసుకురావాలని హోంమంత్రి అనిత పోలీసులకు సూచించారు.

Similar News