ఏపీకి వాతావరణ శాఖ బిగ్ అలర్ట్.. రాష్ట్రంలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు..!

ఆంధ్రప్రదేశ్‌కు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. నైరుతి రుతు పవనాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రానున్న రెండు రోజుల పాటు మోస్తారు

Update: 2024-06-19 12:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌కు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. నైరుతి రుతు పవనాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రానున్న రెండు రోజుల పాటు మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అక్కడక్కడ భారీ ఈదురుగాలులతో కూడిన వర్షంతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది. భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతేనే ఇండ్ల నుండి బయటకు రావాలని సూచించింది. రెండు రోజుల పాటు మత్య్సకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. కాగా, ఇప్పటికే రాష్ట్రమంతటా విస్తరించిన నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో ఏపీలో జోరుగా వర్షాలు పడుతున్నాయి.  


Similar News