జగన్‌కు అన్ని ఆస్తులు ఎక్కడివి?: మంత్రి నిమ్మల సూటి ప్రశ్న

మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి నిమ్మల రామానాయుడు ఫైర్ ఆయ్యారు....

Update: 2024-10-27 15:41 GMT

దిశ, వెబ్ డెస్క్: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former CM Jagan Mohan Reddy)పై మంత్రి నిమ్మల రామానాయుడు(Minister Nimmala Ramanaidu) ఫైర్ ఆయ్యారు. వైఎస్ షర్మిల(YS Sharmila)తో ఆస్తుల వివాదంపై ఆయన స్పందించారు. తనకు చిన్న ఇల్లు ఉందని 2004 ఎన్నికల సమయంలో చూపించిన వైఎస్ జగన్‌(YS Jagan)కు సీఎం అయిన తర్వాత రూ. 8 లక్షల కోట్లు సంపాదించారని ఆరోపించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌(Hyderabad Jubilee Hills)లోని బంగ్లా, లోటస్ పాండ్ ఇల్లు, బెంగళూరులో 82 గదుల ప్యాలెస్ ఎక్కడివి అని ప్రశ్నించారు. జగన్‌కు రాజకీయాల్లో ఉండే అర్హత లేదని విమర్శించారు. ఆస్తుల కోసం తల్లిని, చెల్లిని కోర్టుకు ఈడ్చారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇసుక, భూమి, లిక్కర్, మైన్స్‌లను అడ్డాలుగా మార్చుకుని జగన్ దోపిడీ, లూటీకి ఒడిగట్టారని రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.


Similar News