‘తల్లికి వందనం’ పథకం కచ్చితంగా అమలు చేస్తాం.. మంత్రి నిమ్మల కీలక వ్యాఖ్యలు

ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి అయింది.

Update: 2024-09-22 09:18 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి అయింది. ఈ క్రమంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల పై సీఎం చంద్రబాబు(CM Chandrababu) ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. దీంతో తాజాగా ‘తల్లికి వందనం’ పథకం పై మంత్రి నిమ్మల రామానాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి రూ.15వేల చొప్పున ఇస్తామన్నారు. 2019లో వైఎస్ జగన్(YS Jagan) అధికారంలోకి వచ్చిన 9 నెలలకు ‘అమ్మ ఒడి’ అమలు చేశారు. ఇప్పుడు రెండు, మూడు నెలలకే అమలు చేయలేదని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో రూ.15వేలు అని చెప్పి తక్కువ డబ్బులు ఇచ్చి మోసం చేశారు అని చెప్పారు. వైసీపీ పాలనలో ఐదేళ్లలో ఒక ఏడాది పథకాన్ని అమలు చేయలేదు అని విమర్శించారు.


Similar News