అమరావతిని రాజధానిగా ఒప్పుకున్నాకే బీజేపీతో కలిశాం..
అమరావతిని రాజధానిగా ఒప్పుకున్నాకే బీజేపీతో కలిసేందుకు ఒప్పుకున్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు
దిశ, డైనమిక్ బ్యూరో: అమరావతిని రాజధానిగా ఒప్పుకున్నాకే బీజేపీతో కలిసేందుకు ఒప్పుకున్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. జనసేన కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లడుతూ..వైసీపీ నేతలు మా పొత్తుల గురించి, నా ఐడియాలజీ గురించి మాట్లాడుతున్నారని వారికి ఒక్కటే చెప్పదలుచుకున్నానని, మీరు మీ తప్పుడు రాజకీయాల గురించి.. వేరే పార్టీల్లో గెలిచిన ఎమ్మెల్యేలను తీసుకోవచ్చు కానీ, మేము మా ఆశయాల కోసం వ్యూహాలు మారిస్తే తప్పు అవుతుందా? అని ప్రశ్నించారు.
మేము మీ లాగా స్వార్ధ రాజకీయాల కోసం, మినిస్ట్రీల కోసం కలవమని.. ప్రజలకు న్యాయం జరుగుతుందా, అభివృద్ది జరుగుతుందా.. మా రాష్ట్రం బాగుపడుతుందా అనే ఆలోచనతో కలుస్తామని తెలిపారు. బీజేపీతో కూడా కొన్ని కీలక ఒప్పందాలు జరిగాయని తెలిపారు. వారితో కలిసే సమయంలో అమరావతిని రాజధానిగా ఉండనివ్వాలని, ఉత్తరాంధ్ర వెనుకబడిందని చెడితే.. అండగా నిలుస్తామన్నారు, రాయలసీమ కరువు ప్రాంతంగా ఉందని, అక్కడి వలసలు ఆపడానికి సాయం చేస్తామన్నారు. ఇలాంటి ఒప్పందాలు జరిగాకే బీజేపీతో కలిసేందుకు ఒప్పుకున్నామని తెలియజేశారు.
మీరు తండ్రిని చంపారు అన్నవారితో చేతులు కలపొచ్చా!
— JanaSena Party (@JanaSenaParty) February 10, 2024
మేము మా ఆశయం కోసం, రాష్ట్ర బాగు కోసం, పార్టీ భవిష్యత్తు కోసం వ్యూహాలు మార్చకూడదా!!#JSPFutureOfAP#HelloAP_ByeByeYCP #HelloAP_VoteForJanaSenaTDP #VoteForGlass#APElections2024 pic.twitter.com/KgpbYOACW3