Pushpa 2 : విద్యుత్తు చార్జీల పోస్టులపై పుష్ప 2 సాంగ్ తో వార్నింగ్ !
ఏపీ(AP)లో సోషల్ మీడియా విచ్చలవిడి పోస్టులపై టీడీపీ(TDP) కూటమి ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకుంటుండగా, ప్రభుత్వ వైఖరిని వైసీపీ తప్పుబడుతోంది.
దిశ, వెడ్ డెస్క్ : ఏపీ(AP)లో సోషల్ మీడియా విచ్చలవిడి పోస్టులపై టీడీపీ(TDP) కూటమి ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకుంటుండగా, ప్రభుత్వ వైఖరిని వైసీపీ తప్పుబడుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తాజాగా పెంచిన విద్యుత్తు చార్జీల(Electricity charges)కు వ్యతిరేకంగా పోస్టులు పెడితే చర్యలు తప్పవన్నట్లుగా సోషల్ మీడియాలో వ్యంగ్యమైన పోస్టులు సందడి చేస్తున్నాయి. ఇందుకోసం పోస్టుల్లో పుష్ప 2(Pushpa 2) సినిమాలోని అల్లు అర్జున్ శ్రీలీల నటించిన దెబ్బలు పడుతయిరో స్పెషల్ సాంగ్ ను పోస్టు చేస్తున్నారు.
విద్యుత్తు చార్జీలు పెరిగాయని పోస్టులు పెడితే దెబ్బలు పడుతయిరో అన్నట్లుగా ఉన్న ఈ పోస్టులను ఎక్స్ లో చూసిన నెటిజన్లు సందర్భోచితంగా ఉందంటూ కొందరూ..ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారికి హెచ్చరికలా ఉందని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.