రేషన్ డిపోలు ఎం.డి.యు వాహనాలపై విస్తృత దాడులు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజా పంపిణీ వ్యవస్థలో అవినీతి, అవకతవకలు జరగకూడదనే ముఖ్య ఉద్దేశ్యంతో అక్కడక్కడ ఫిర్యాదుల మేరకు లీగల్ మెట్రాలజీ అధికారులు గత కొన్ని రోజులుగా రేషన్ డీలర్లు
దిశ ప్రతినిధి, విజయనగరం: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజా పంపిణీ వ్యవస్థలో అవినీతి, అవకతవకలు జరగకూడదనే ముఖ్య ఉద్దేశ్యంతో అక్కడక్కడ ఫిర్యాదుల మేరకు లీగల్ మెట్రాలజీ అధికారులు గత కొన్ని రోజులుగా రేషన్ డీలర్లు మరియు ఎం.డి.యు వాహనదారులపై విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ కొంతమంది రేషన్ డీలర్లు మరియు ఎం.డి.యు వాహనదారులు ప్రజా పంపిణీ లో అక్కడక్కడ మోసాలకు పాల్పడుతున్నారు. ఆ కారణంగా లీగల్ మెట్రాలజీ అధికారులు వరుస దాడులు నిర్వహిస్తూ బుధవారం నెల్లిమర్ల మండలంలోని పలు గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి మూడు కేసులు నమోదు చేశారు.
ఈ సందర్భంలో రేషన్ డీలర్లు మరియు ఎం.డి.యు వాహనదారులను తూకంలో తేడాలు రాకూడదని విజయనగరం జిల్లాలో ఎవరైతే తూనిక యంత్రములు సీలు వేయించుకున్న వారు తప్పనిసరిగా వేయించుకోవాలని లేనిచో కఠిన చర్యలు తీసుకోబడునని హెచ్చరించారు.దన్నాన పేట,నెల్లిమర్ల, రామతీర్థం, తదితర గ్రామాల్లో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఇన్స్పెక్టర్ యం. దామోదర నాయుడు, టెక్నికల్ అసిస్టెంట్ బి. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.