AP Tragedy: ఏపీలో విషాదం.. వాగులో మునిగి నలుగురు మృతి
వాగులో నుంచి ఇసుక తీస్తుండగా.. ఒక్కసారిగా లోతులోకి వెళ్లి ఊబిలో కూరుకుపోయారు. భూషణం అనే వ్యక్తి మునిగిపోతుండగా.. అతడిని కాపాడేందుకు వెళ్లిన బాబు, గొంతయ్య, శ్రీను కూడా వాగులో మునిగి మరణించారు.
దిశ, వెబ్ డెస్క్: ఇసుక కోసం వాగులోకి దిగి నలుగురు యువకులు మరణించిన విషాద ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా (Alluri Sitaramaraju District) రంపచోడవరం ఏజెన్సీలో చోటుచేసుకుంది. జిల్లాలోని అడ్డతీగల మండలం తిమ్మాపురంలో ఈ విషాద ఘటన జరిగింది. వాగులో నుంచి ఇసుక తీస్తుండగా.. ఒక్కసారిగా లోతులోకి వెళ్లి ఊబిలో కూరుకుపోయారు. భూషణం అనే వ్యక్తి మునిగిపోతుండగా.. అతడిని కాపాడేందుకు వెళ్లిన బాబు, గొంతయ్య, శ్రీను కూడా వాగులో మునిగి మరణించారు. మృతుల్లో తండ్రి కొడుకులు కూడా ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. అయితే వీరంతా ఏలేశ్వరంకు చెందినవారుగా గుర్తించారు పోలీసులు. అనధికారికంగా ఇసుక తవ్వకాలు చేస్తున్నట్లు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని.. మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టంకు పంపారు.