AP Politics:నియోజకవర్గంలో త్వరలో అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తాం:ఎమ్మెల్యే సుజనా చౌదరి
అన్న క్యాంటీన్లను త్వరలో ప్రారంభిస్తున్నట్లు పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రకటించారు.
దిశ ప్రతినిధి,విజయవాడ:అన్న క్యాంటీన్లను త్వరలో ప్రారంభిస్తున్నట్లు పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రకటించారు. పేద ప్రజల ఆకలికి ఇచ్చేందుకు అప్పటి టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను కక్షపూరితంగా వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు. 42 డివిజన్లో ఉన్న అన్న క్యాంటీన్ భవనాన్ని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి సోమవారం సందర్శించారు. క్యాంటీన్ భవనాన్ని పరిశీలించి అన్న క్యాంటీన్ ప్రారంభించేందుకు కావలసిన ఏర్పాట్లు గురించి చర్చించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..నాటి వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా, టిడిపి ప్రభుత్వం ప్రారంభించిన అన్న క్యాంటీన్లను రద్దుచేసి, వాటిలో గ్రామ సచివాలయాలుగా మార్చిందని తెలిపారు. పేదల ఆకలి తెచ్చేందుకు మళ్లీ అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అందుకు కావలసిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అన్న క్యాంటీన్ సందర్శించిన వారిలో టీడీపీ నాయకులు ఎదుపాటి రామయ్య, ప్రసన్న లక్ష్మి, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.