Train Accident: సీఎం జగన్ పర్యటనలో స్వల్ప మార్పులు

సీఎం జగన్ మోహన్ రెడ్డి రైలు ప్రమాద బాధితులను పరామర్శించారు..

Update: 2023-10-30 07:47 GMT

దిశ, వెబ్ డెస్క్: విజయనగరం జిల్లా కంటకాపల్లి వద్ద రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 15 మంది మృతి చెందగా.. చాలా మంది వరకు గాయపడ్డారు. అయితే ఈ ఘటన స్థలాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి పరిశీలించాలనుకున్నారు. అనంతరం బాధితులను పరామర్శించాలనుకున్నారు. కానీ ప్రమాద స్థలానికి సీఎం జగన్  వెళ్లడంలేదు. రైల్వే అధికారుల సూచనల మేరకు విశాఖ, విజయనగరంలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను, మృతుల కుటుంబాలను సీఎం పరామర్శించనున్నారు. ఈ మేరకు ఆయన గుంటూరు జిల్లా తాడేపల్లి నుంచి ఇప్పటికే బయల్దేరారు. మరికాసేపట్లో విశాఖకు చేరుకోనున్నారు. అనంతరం రైలు ప్రమాద క్షతగాత్రులను సీఎం జగన్ పరామర్శించారు.

కాగా విజయనగరం జిల్లాలో చోటు చేసుకున్న రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆదివారం రాత్రి కంటకాపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 15 మంది మృతి చెందగా.. చాలా మందికి పైగా ప్రయాణికులు గాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. కంటకాపల్లి వద్ద సిగ్నల్ కోసం ఆగి ఉన్న విశాఖపట్టణం-పలాస రైలును అదే ట్రాక్‌లో వెనుక నుంచి వచ్చిన విశాఖ-రాయగఢ రైలు ఢీకొట్టింది. దీంతో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఘటనా స్థలం వద్ద సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. విద్యుత్, ట్రాక్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ప్రమాదంలో నుజ్జునుజ్జు అయిన బోగీలను పక్కకు తొలగిస్తున్నారు. 

Tags:    

Similar News