దేశానికే ఆదర్శం జగనన్న ఆరోగ్య సురక్ష: minister Bosta
జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం దేశానికే ఆదర్శమని రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు...
దిశ, ఉత్తరాంధ్ర: దేశానికే ఆదర్శం జగనన్న ఆరోగ్య సురక్ష: minister Bostaమని రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. దేశంలోనే మొట్టమొదటి సారిగా, రాష్ట్ర ప్రజలందరి ఆరోగ్య వివరాలను నమోదు చేసి, అవసరమైన వారందరికీ వైద్యం అందించడం ఈ అద్భుత కార్యక్రమం లక్ష్యమని ఆయన చెప్పారు. విజయనగరం జిల్లా గరివిడి మండలం చుక్కవలసలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో సుమారు కోటి, 63 లక్షల కుటుంబాల్లోని దాదాపు ఐదు కోట్ల మందికి చెందిన ఆరోగ్య డేటాను సేకరించడం జరుగుతుందన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ఆరోగ్య, వైద్య పరీక్షలను నిర్వహించి, మందులను ఉచితంగా అందజేసి, ఇంకా మెరుగైన వైద్యం అవసరమైన వారికి ఇతర ఆసుపత్రలకు రిఫర్ చేయడం జరుగుతుందని చెప్పారు. నవంబరు 15 లోపల రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లో అన్ని సచివాలయాల పరిధిలో శిబిరాలను నిర్వహిస్తామని తెలిపారు.
ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంటివద్దకే వైద్యాన్ని అందించేందుకు ఈ వినూత్న కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారని చెప్పారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా ఇప్పటికే వైద్యాన్ని ప్రజల వద్దకు చేర్చిన ముఖ్యమంత్రి, ఆరోగ్య సురక్ష ద్వారా స్పెషలిస్టు సేవలను సైతం గ్రామాల్లోకి తెచ్చారని అన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆరోగ్య శ్రీ, 108 ద్వారా వైద్యాన్ని పేద ప్రజలకు అందిస్తే, ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డి దానిని మరింత చేరువ చేర్చారని కొనియాడారు. ప్రతి ఒక్కరికీ ఒక ఆరోగ్య గుర్తింపు సంఖ్యను కేటాయించి, వారి వివరాలను నమోదు చేయడం జరుగుతుందని ఎంపీ తెలిపారు.