Breaking: ఏవోబీ కీలక మావోయిస్ట్ రైను అరెస్ట్
ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దు అటవీ ప్రాంతంలో సీపీఐ మావోయిస్ట్ పార్టీకి చెందిన డివిజన్ కమిటీ మెంబర్ జనుమూరి శ్రీనుబాబు(రైను)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు....
దిశ, అల్లూరి సీతారామరాజు జిల్లా: ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దు అటవీ ప్రాంతంలో సీపీఐ మావోయిస్ట్ పార్టీకి చెందిన డివిజన్ కమిటీ మెంబర్ జనుమూరి శ్రీనుబాబు(రైను)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైను నుంచి ఒక ఐఈడీ, తుపాకీ, పేలుడు సామగ్రి, విప్లవ సాహిత్యం, నగదు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. 2 వేల సంవత్సరంలో పార్టీలో చేరిన రైను ఎల్లవరం, గుర్తేడు నందపూర్ దళాల్లో పని చేశాడు. ఏపీ, ఒడిశా, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో అనేక హింశాత్మక ఘటనల్లో యాక్న్ ప్లానింగ్‌లలో కీలక పాత్ర పోషించాడు. 2018లో అరకు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హత్య కేసులో ప్రధాని నిందితుడు. రైనుపై రూ. 5 లక్షల రివార్డు ఉంది. నిందితుడిని కోర్టులో హాజరుపరిచినట్లు అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీస్ యంత్రాంగం తెలిపింది.