దేవుని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైనా ఉండాలి: డిప్యూటీ స్పీకర్
లోక కళ్యాణార్థం దాసన్నపేట కాశీ విశ్వేశ్వరుని ఆశీస్సులు ప్రతి ఒక్కరి పైన ఉండాలని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి ఆకాంక్షను వ్యక్తం చేశారు.
దిశ, విజయనగరం: లోక కళ్యాణార్థం దాసన్నపేట కాశీ విశ్వేశ్వరుని ఆశీస్సులు ప్రతి ఒక్కరి పైన ఉండాలని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈరోజు రథం సెంటర్ కాశీ విశ్వేశ్వరుని ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో కాశీ విశ్వేశ్వరుని కళ్యాణ ఘట్టాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. వేదమంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాల నడుమ శోభాయమానంగా వార్షికోత్సవ క్రతువులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వహణ కమిటీ ప్రతినిధులు బోడసింగి ఈశ్వరరావు మాట్లాడుతూ.. దాసన్నపేటలో కాశీ విశ్వేశ్వరుని ఆలయం భక్తుల ఆదరాభిమానాలతో అలరారుతుందని అన్నారు.
ఆలయ నిర్మాణంలో ఎంతోమంది సహకరించి స్వామివారి కృపకు పాత్రులు అయ్యారని అన్నారు. కాశీ విశ్వేశ్వరుని ప్రత్యేక పర్వదినాలను కూడా చేపడుతున్నామన్నారు. దీంతో భక్తులు దశలవారీగా పెరుగుతూ వస్తున్నారన్నారు. కాశీ విశ్వేశ్వరుని మహిమలు తెలుసుకొని భక్తుల సంఖ్య పెరుగుతుందన్నారు. ఈరోజు ఆలయ వార్షికోత్సవ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి రావడం తమకెంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. కాశీ విశ్వేశ్వరుని ఆశీస్సులతో రానున్న ఎన్నికల్లో ఆయన మరోసారి శాసనసభ్యులుగా గెలుపొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు,ప్రజలు పాల్గొన్నారు.
Read More..
వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం