Ys Jagan నిన్ను జైల్లో వేయలేమా?

బీసీలకు జగన్ హయాంలో అన్యాయం జరుగుతోందని ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ నష్టాన్నంతా పూర్తి చేసేది తెలుగుదేశమేనని చెప్పారు. రాజాంలో బీసీ వర్గాలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు..

Update: 2022-12-23 10:40 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: బీసీలకు జగన్ హయాంలో అన్యాయం జరుగుతోందని ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ నష్టాన్నంతా పూర్తి చేసేది తెలుగుదేశమేనని చెప్పారు. రాజాంలో బీసీ వర్గాలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. తనను 40 ఏళ్లు ఆదరించి గౌరవించిన బీసీలకు న్యాయం చేస్తానని చెప్పారు. బీసీ సాధికార కమిటీ ద్వారా బీసీల కోసం ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. రాజకీయంగా, సామాజికంగా బీసీ వర్గాల్లో మార్పులు వచ్చాయని... 50 శాతం పైగా ఉన్న బీసీలను ఆర్థికంగా పైకి తీసుకురావాలని ప్రణాళికలు రూపొందించి.. అమలు చేసిందని టీడీపీనేని చెప్పారు. నాడు కేంద్రంలో ఒక్కటే మంత్రి పదవి వస్తే...దాన్ని ఎర్రన్నాయుడికి ఇచ్చిన ఘనత టీడీపీదేనని చెప్పుకొచ్చారు. అంతేకాదు అయ్యన్నపాత్రుడు, యనమల రామకృష్ణుడు, కేఈ కృష్ణమూర్తి, దేవేందర్ గౌడ్ వంటి బీసీ నేతలకు పదవులు ఇచ్చింది టీడీపీనేనన్నారు. ఎన్టీఆర్ హయాంలోనే బీసీ కమిషన్ ఆవిర్భవించిందని చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు.

జగన్‌ను తరిమేయడం ఖాయం

'బీసీల్లో వంశపారపర్యంగా కులవృత్తులు, చేతి వృత్తులు వచ్చాయి. అందుకే వారి కోసం ప్రత్యేక పథకాలు తెచ్చి ఆర్థికంగా పైకి తీసుకువచ్చాం. బీసీల ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు తెచ్చేందుకు టీడీపీ కంకణం కట్టుకుని పని చేసింది. గతంలో కల్లుగీత కార్మికులు జీవితాల్లో మార్పులు తీసుకువచ్చి వారిని ఆదుకున్నది కేవలం తెలగుదేశం పార్టీ మాత్రమే. ఇప్పుడు జగన్ రెడ్డి సొంత మద్యం అమ్మకుంటున్నాడు.. టీడీపీ వచ్చిన తరువాత కల్లుగీత కార్మికులకు 20 శాతం ప్రభుత్వ మద్యం షాపులు కేటాయిస్తాం. బీసీల పథకాలకు డబ్బులు లేవు కానీ...జగన్ సొంతపేపర్‌లో ప్రకటనల కోసం మాత్రం వందల కోట్లు ఇస్తున్నారు. స్కూళ్లలో జగన్ సొంత పేపర్ తప్ప మరో పేపర్ లేదు. ఈ విషయాన్ని కోర్టు సైతం ఆక్షేపించింది. చైనాలో మావో తీరుపై ఆగ్రహంతో అక్కడి ప్రజలు ఆయన విగ్రహాలు తొలగించారు. జగన్ చేసే తప్పుడు పనులకు రాష్ట్రం నుంచి జగన్‌ను పూర్తిగా తరిమేయడం ఖాయం'. అని చంద్రబాబు ధ్వజమెత్తారు.

మత్స్యకారులను ఆదుకుంది టీడీపీయే

సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్య కారులకు పెట్రోల్, డీజిల్ సబ్సిడీ ఇచ్చి తెలుగుదేశం ప్రభుత్వం ఆదుకుందని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. చేపలవేట విరామంలో మత్స్యకార కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించామని... అంతేకాకుండా అధునిక బోట్లు అందుబాటులోకి తెచ్చినట్లు చంద్రబాబు వెల్లడించారు. విశ్వబ్రాహ్మణల పరిస్థితి రాష్ట్రంలో మరింత దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రికవరీ పేరుతో వారిపై తప్పుడు కేసులు పెట్టి వేధించేవారని చంద్రబాబు అన్నారు. మంగళసూత్రం తయారైన తర్వాతే ముహూర్తం పెట్టుకునే పరిస్థితి నాడు ఉండేదంటే విశ్వబ్రాహ్మణులకు అంత డిమాండ్ ఉండేదో అర్థం చేసుకోవచ్చన్నారు. బీసీలలో అన్ని వృత్తుల వారూ ఈ ప్రభుత్వ హాయంలో ఆర్థికంగా దెబ్బతిన్నారని మండిపడ్డారు. బీసీలలో 140 కులాలు ఉన్నాయి. వారందరినీ ఆదుకుంటామని.. వీటి కోసమే 54 బీసీ సాధికార కమిటీలు వేశామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

బీసీ నేతలను జైలుపాల్జేశారు

బీసీ నేతలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ చంద్రబాబు నాయుడ తీవ్ర ఆరోపణలు చేశారు. మాజీమంత్రి కొల్లు రవీంద్రలాంటి వారిపై అక్రమ కేసు పెట్టి జైల్లో పెట్టారని ధ్వజమెత్తారు. 'జగన్ నిన్ను జైల్లో వెయ్యలేమా.? అజాత శత్రువు లాంటి కొల్లు రవీంద్రపై కేసులు పెట్టి పైశాచిక ఆనందం పొందుతారా?. అచ్చెన్నాయుడుపైనా అక్రమ కేసు పెట్టిన జగన్ ఏం పీకాడు.?. 72 రోజులు అచ్చెన్నను జైల్లో పెట్టావు. జగన్ జైల్లో ఉన్నాడు కాబట్టి...అందరూ జైల్లో ఉండాలని అంటున్నారు. చివరికి కళా వెంకటరావు, అయ్యన్న పాత్రుడుపైనా కేసులు పెట్టారు. 72 ఏళ్ల అయ్యన్నపై రేప్ కేసు పెట్టిన జగన్‌ను ఏమనాలి?. బీసీ మహిళ గౌతు శిరీషపైనా కేసులు పెట్టారు. గౌతు లచ్చన్న లాంటి కుటుంబ సభ్యురాలిపై కేసు పెట్టారు. గౌతు లచ్చన్న కుటుంబం అంటే కూడా గౌరవం లేదా?. కూన రవిపై అయితే కేసులే కేసులు..బీసీలపై కక్ష సాధించిన నిన్ను ఇంటికి పంపడం ఖాయం. ఇంత దారుణాలు చేసిన జగన్ పార్టీని బంగాళాఖాతంలో కలిపేద్దాం'. అని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

ALSO READ : కమలాపురంపై Cm Jagan ప్రత్యేక దృష్టి.. రూ.900 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం

Tags:    

Similar News