Minister Kandula Durgesh:ఏపీ విజన్ 2047 తరహాలోనే.. విజన్ 2027 గోదావరి పుష్కరాలకు సన్నద్ధం
రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వంలోనే పర్యాటక శాఖ అభివృద్ధి(Development of Tourism Department) సాధ్యం అవుతుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్(Minister Kandula Durgesh) పేర్కొన్నారు.
దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వంలోనే పర్యాటక శాఖ అభివృద్ధి(Development of Tourism Department) సాధ్యం అవుతుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్(Minister Kandula Durgesh) పేర్కొన్నారు. ఈ క్రమంలో నేడు(మంగళవారం) రాజమహేంద్రవరంలోని మున్సిపల్ కార్యాలయం(Municipal Office) సమావేశ మందిరంలో 2027 సంవత్సరం లో నిర్వహించనున్న గోదావరి పుష్కరాలకు సంబంధించి చేపట్టనున్న ముందస్తు ఏర్పాట్ల పై సంబంధిత సమన్వయ శాఖల అధికారులతో మంత్రి కందుల దుర్గేష్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అఖండ గోదావరి పుష్కరాలు 2027ను దృష్టిలో పెట్టుకొని తూర్పుగోదావరి జిల్లాను యూనిట్‌గా పరిగణనలోకి తీసుకొని సమగ్ర అభివృద్ధితో కూడిన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్లేందుకు ప్రాథమిక సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగిందని మంత్రి దుర్గేష్ అన్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి విజన్ 2047 తరహాలోనే గోదావరి పుష్కరాలు 2027కు విజనరీతో ముందుకు వెళుతున్నట్లు పేర్కొన్నారు. రానున్న గోదావరి పుష్కరాలకు సుమారు 8 కోట్ల మంది భక్తులు(devotees) వచ్చే అవకాశం ఉన్నట్లు మంత్రి పేర్కొన్నారు. భవిష్యత్తు అంశాలను దృష్టిలో ఉంచుకొని సమగ్ర కార్యాచరణ పై అధికారులతో చర్చించడం జరిగిందని స్పష్టం చేశారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటి నుంచే భక్తుల రద్దీ(Crowd of devotees) , ట్రాఫిక్ నియంత్రణ(Traffic control), తదితర అంశాలను దృష్టిలో పెట్టుకోవడం జరిగిందన్నారు. ఉత్తర భారతదేశంలో కాశీ పుణ్యక్షేత్రం ఎంత ప్రాశస్త్యం కలిగి ఉందో, అదే స్థాయి రాజమహేంద్రవరంలోని గోదావరి నది తీరానికి ఉందని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు.