విశాఖలో ప్రధాని మోడీ పర్యటన.. SPG ఆధీనంలో ఆంధ్రా యూనివర్సిటీ

ఈ రోజు సాయంత్రం భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖలో పర్యటించనున్నారు.

Update: 2025-01-08 04:28 GMT

దిశ, వెబ్ డెస్క్: ఈ రోజు సాయంత్రం భారత ప్రధాని(Indian Prime Minister) నరేంద్ర మోడీ(Narendra Modi) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా విశాఖ కేంద్రంగా "దక్షిణ కోస్తా రైల్వే జోన్" కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవం, పూడిమడకలో రూ.1,85,000 కోట్ల పెట్టుబడితో NTPC గ్రీన్ హైడ్రోజన్ హబ్, నక్కపల్లి ప్రాంతంలో రూ.1,877 కోట్ల పెట్టుబడితో బల్క్ డ్రగ్ పార్క్‌లకు ప్రధాని మోడీ(Prime Minister Modi) శంకుస్థాపన చేయనున్నారు. అలాగే అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గోని, రోడ్ షో(Road show) నిర్వహించి.. పబ్లిక్ మీటింగ్(Public meeting) లో పాల్గొంటారు.

దీంతో ఏపీ ప్రభుత్వం(AP Govt)  ప్రధాని మోడీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత(Strict security) ఏర్పాట్లు చేసింది. ఇప్పటికి 48 గంటల పాటు విశాఖలో ఎటువంటి డ్రోన్లను ఎగురవేయ వద్దని జీవో విడుదల చేసింది. అయితే మోడీ పర్యటన(Modi's visit)కు 5 వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేశారు. ఈ బందోబస్తు విధుల్లో 32 మంది ఐపీఎస్‌ అధికారులు,18 మంది అడిషనల్ ఎస్పీలు, 60 మంది డీఎస్పీలు, 180 మంది సీఐలు, 400 మంది ఎస్ఐలు ప్రత్యక్షంగా విధులు నిర్వహిస్తున్నారు. అలాగే ప్రధాని మోడీ పాల్గొనేందుకు ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్ ప్రదేశం అయిన ఆంధ్రా యూనివర్సిటీ(Andhra University) పరిసరాలను SPG తమ అధీనంలోకి తీసుకుంది.


Similar News