మహాకుంభమేళాకు బయలుదేరిన శ్రీవారి కళ్యాణ రథం

జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా జరగనుంది. ఈ కుంభమేళకు సంబంధించిన ఏర్పాట్లను యూపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున చేసింది.

Update: 2025-01-08 04:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌(Prayagraj)లో మహా కుంభమేళా(Maha Kumbh Mela) జరగనుంది. ఈ కుంభమేళకు సంబంధించిన ఏర్పాట్లను యూపీ ప్రభుత్వం(UP Govt) పెద్ద ఎత్తున చేసింది. 12 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ అధ్బుత ఘట్టంలో పాల్గొనేందుకు శ్రీవారి కళ్యాణ రథం(Srivari Kalyana Ratham) యూపీకి బయలుదేరింది. ఈ రోజు ఉదయం 10 గంటలకు టీటీడీ చైర్మన్(TTD Chairman) బీఆర్ నాయుడు(BR Naidu), అదనపు ఈవో వెంకయ్య చౌదరి కళ్యాణ రథానికి పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బీఆర్ నాయుడు మాట్లాడుతూ.. మహాకుంభమేళాను తెలుగు రాష్ట్రాల ప్రజలు విజయవంతం చేయాలని, యూపీ ప్రభుత్వం కేటాయించిన 2.5 ఎకరాల స్థలంలో శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటు చేశామని తెలిపారు.


Similar News