మహిళా రిజర్వేషన్లు పచ్చి మోసం:పీఓడబ్ల్యు
మహిళల జనాభా కనుగుణంగా పార్లమెంటులో, శాసనసభలో 50 శాతం రిజర్వేషన్ కోరితే కేవలం 33 శాతం చట్టంగా చేసి దాన్ని కూడా అనేక రకాల ఆంక్షలు పెట్టి అది కూడా 2029 తర్వాత అమలులోకి వచ్చే విధంగా దుర్మార్గమైన పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిందని పలువురు మహిళా సంఘాల నేతలు విమర్శించారు.
దిశ ప్రతినిధి, విశాఖపట్నం:మహిళల జనాభా కనుగుణంగా పార్లమెంటులో, శాసనసభలో 50 శాతం రిజర్వేషన్ కోరితే కేవలం 33 శాతం చట్టంగా చేసి దాన్ని కూడా అనేక రకాల ఆంక్షలు పెట్టి అది కూడా 2029 తర్వాత అమలులోకి వచ్చే విధంగా దుర్మార్గమైన పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిందని పలువురు మహిళా సంఘాల నేతలు విమర్శించారు.POWవిశాఖ జిల్లా కమిటీ అంతర్జాతీయ మహిళా దినం సందర్భంగా మార్చి 1 నుంచి 15 వరకు సభలు, సమావేశాలు, ర్యాలీ నిర్వహించమని పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద శుక్రవారం జరిగిన సభలో ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం. లక్ష్మి, సావిత్రిబాయి పూలే ట్రస్ట్ చైర్ పర్సన్ గూడూరు సీతామహాలక్ష్మి పాల్గొన్నారు.
భారత నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్షుడు టి శ్రీరామమూర్తి, ఐ ఎఫ్ టి యు రాష్ట్ర ఉపాధ్యక్షులు యం.వెంకటేశ్వర్లు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ విశాఖ విజయనగరం ఏరియా కమిటీ అధికార ప్రతినిధి వై కొండయ్య అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి కె నిర్మల, దళిత విముక్తి కన్వీనర్ ఎస్వీ రమణ, మురికివాడ నివాసుల సంక్షేమ సంఘం పూర్వ అధ్యక్షులు కే రవి, కన్వీనర్ ఈసర లక్ష్మి, మానవ హక్కుల వేదిక జిల్లా అధ్యక్షులు శరత్ తదితరులు మాట్లాడారు. బీజేపీ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల హక్కులు మరింతగా కాలా రాయబడుతున్నాయని నిర్ణయాధికార స్వేచ్ఛను దెబ్బతీస్తున్నాయి. మనువాద భావజాలం మరింత పెరిగిపోయి మహిళలకు రక్షణ లేని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు.