అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా పోలీసులకు సన్మానం..
పోలీసు శాఖ నందు విధులలో ప్రతిభ కనబరిచిన మహిళలను ప్రత్యేకంగా గుర్తించి సత్కరించడం స్ఫూర్తిదాయకం అనీ విశాఖ ఎస్ ఇ జెడ్ జాయింట్ డెవలప్మెంట్ కమిషనర్ రోష్ని అపరంజి కొరాటి అన్నారు.
దిశ ప్రతినిధి, విశాఖపట్నం: పోలీసు శాఖ నందు విధులలో ప్రతిభ కనబరిచిన మహిళలను ప్రత్యేకంగా గుర్తించి సత్కరించడం స్ఫూర్తిదాయకం అనీ విశాఖ ఎస్ ఇ జెడ్ జాయింట్ డెవలప్మెంట్ కమిషనర్ రోష్ని అపరంజి కొరాటి అన్నారు. విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ రవి శంకర్ నేతృత్వంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పలువురు మహిళా అధికారులు సిబ్బందికి సన్మానం చేశారు. జాయింట్ సీపీ కే.ఫక్కీరప్ప కాగి నెల్లి, డి.సి.పి-1(ఎల్&ఓ) వి.ఎన్. మణికంఠ చందోలు, ,డి.సి.పి(క్రైమ్స్) పి.వెంకటరత్నం , డి.డి ఆఫ్ ప్రాసిక్యూషన్స్ యం.శైలజా , ఏడీసీపీ లు, ఎ.సి.పి లు, మహిళా పోలీసు అధికారులు, ఉమెన్ పి.సి లు, హెచ్.సిలు, మహిళా పోలీసులు, మహిళా హోం గార్డులు పాల్గొన్నారు. మహిళా సాధికారత పై, మహిళలు మరింత ఉన్నత దిశగా అడుగులు వేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై టీ. కల్యాణి , ఎన్. సునీత మాట్లాడుతూ మహిళా సాధికారత పై తమ ఆలోచనలను పంచుకున్నారు.
జాయింట్ సీ.పీ కే.ఫక్కీరప్ప కాగినెల్లి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం-2024 సందర్భంగా నగర పోలీసు శాఖ నందు విధులు నిర్వహిస్తున్న మహిళల కోసం వైజాగ్ సిటీ పోలీస్ మహిళా కో- ఆపరేటివ్ సొసైటీ ని ఏర్పాటు చేయడం జరిగిందనీ, దీని ప్రధాన ఉద్దేశం మహిళలకు ఆర్ధికంగా మరింత భరోసా కల్పించడం అనీ, దీనికోసం ప్రత్యేకంగా పోలీసు కార్పస్ ఫండ్ నుంచి 10 లక్షల రూపాయలు అందించడం జరిగిందనీ, మొత్తం మహిళలతో వైజాగ్ సిటీ పోలీస్ మహిళా కో- ఆపరేటివ్ సొసైటీ బాడీ ఏర్పాటు చేసి త్వరలోనే పని ప్రారంభిస్తుంది. పోలీసు శాఖ మహిళలు ఈ సొసైటీ ద్వారా తక్కువ వడ్డీ రేటుకు నగదు తీసుకోవచ్చని తెలియజేశారు.