కుదిరిన పొత్తు ఒప్పందం.... 30 అసెంబ్లీ, 8 లోక్ సభ సీట్లకు బీజేపీ, జనసేన పోటీ?

పొత్తు రాజకీయాలలో అనూహ్య మార్పులు చోటుచేసుకొన్నాయి...

Update: 2024-03-08 06:42 GMT

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: పొత్తు రాజకీయాలలో అనూహ్య మార్పులు చోటుచేసుకొన్నాయి. బీజేపీకి విడిగా గాక జనసేనతో కలసి సీట్లు కేటాయించే ప్రతిపాదనకు అంగీకారం కుదిరినట్లు తెలిసింది. ఇందులో భాగంగా 30 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ జనసేన పోటీ చేయనున్నాయి. జనసేనకు తెలుగుదేశం గతంలో 24 సీట్లను కేటాయించింది. అంటే బీజేపీకి ఆరు అసెంబ్లీ సీట్లు దక్కాయి. ఇక జనసేనకు వదిలేసిన మూడు లోక్ సభ సీట్లను తీసేస్తే బీజేపికి ఐదు సీట్లు కేటాయించినట్లైంది. సీట్ల షేరింగ్‌లో ఆ రెండు పార్టీల మధ్య కూడా మార్పు చేర్పులు వుండే అవకాశాలున్నాయి. ఇప్పటికి కుదిరిన అంగీకారం ప్రకారం 8 లోక్ సభ స్థానాల్లో బీజేపీ జనసేన పోటీ చేస్తాయి. ఆ సీట్లు అరకు, అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి., నరసాపురం, మచిలీపట్నం, తిరుపతి, రాజంపేట అని తెలిసింది. ఇందులో అనకాపల్లి, కాకినాడ, మచిలీపట్నం జనసేన పోటీ చేయనుంది. మిగిలిన స్ధానాలలో బీజేపీ బరిలోకి దిగుతుంది. అసెంబ్లీ స్ధానాల వివరాలు వెల్లడి కావాల్సివుంది.


Similar News