చలి పులి.. మరో రెండు రోజులు గజగజే..!
తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు చలి గుప్పెట్లోకి చేరుకున్నాయి. ..
దిశ ప్రతినిధి, విశాఖపట్నం: తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు చలి గుప్పెట్లోకి చేరుకున్నాయి. వచ్చే రెండు రోజుల పాటు పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా చిన్నారులు, గర్భిణులు, వృద్దులు మంకీ క్యాప్‌లు, జెర్కిన్స్, చలి కోట్లు తప్పనిసరిగా ధరించాలని అన్నారు. అవసరమైతే తప్ప ఉదయం బయటికెళ్లొద్దని తెలిపారు.
గజగజలాడుతున్న మన్యం..
మన్యంలో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. అరకు, పాడేరు, చింతపల్లి తదితర ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఉదయం 10 గంటల వరకు గిరిజనులు బయటికి రాలేకపోతున్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాదిలో ఎక్కువగా ఉందని చెబుతున్నారు. రెండు రోజులుగా మంచు కూడా ఎక్కువగా కురుస్తుండటంతో ఉదయం పూట ప్రయాణాలు కష్టమవుతున్నాయి.