విశాఖలో భర్త దారుణం.. భార్య పోరాటం

భార్యను కంటికి రెప్పలా కాపాడాల్సిన భర్త కర్కశంగా వ్యవహరించారు. ..

Update: 2024-02-07 12:38 GMT

దిశ, వెబ్ డెస్క్: భార్యను కంటికి రెప్పలా కాపాడాల్సిన భర్త కర్కశంగా వ్యవహరించారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెకు అన్నీ తానై ఆలనా పాలన చూసుకోవాల్సింది పోయి వదిలించుకోవాలని చూస్తున్నారు. కష్టంలో అండగా ఉండకుంటూ పుట్టింట్లోనే వదిలిశాడు. అంతేకాదు విడాకులు ఇవ్వాలని నోటీసులు పంపారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన భార్య పోరాటానికి దిగారు. భర్త ఇంటి ముందు ధర్నా చేపట్టారు. ఈ ఘటన విశాఖలో జరిగింది.

విశాఖ చెందిన వ్యక్తితో ఆమెకు వివాహం జరిగింది. అయితే వీరి కాపురంలో అనారోగ్యం చిచ్చు పెట్టింది. భార్యకు కిడ్నీ ఫెయిల్ అయ్యింది. దీంతో ఆమెను వదిలించుకోవాలనుకున్నారు. కాపురానికి పనికి రావంటూ విడాకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు నోటీసులు పంపారు. దీంతో భార్య న్యాయ పోరాటానికి దిగారు. భర్త ఇంటి ముందు ధర్నా చేపట్టారు. అయితే భార్య విషయం తెలుసుకున్న భర్త అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో మహిళా మండలి సభ్యులతో కలిసి భర్తపై దువ్వాడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని ఆమె కోరుతున్నారు.


Similar News