Paderu: బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారం
పాడేరు బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ..
దిశ, వెబ్ డెస్క్: పాడేరు బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, తీవ్రంగా గాయపడ్డ క్షతగాత్రులకు రూ.5 లక్షలు, గాయపడ్డవారికి రూ. లక్షల చొప్పున సీఎం జగన్ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. కాగా అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు లోయలో పడింది. దీంతో ఇద్దరు మృతి చెందారు. పలువురి పరిస్థితి విషయంగా ఉంది. 10 మందికి పైగా గాయాలయ్యాయి. వీరికి పాడేరు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
సడెన్ బ్రేక్ వేయడంతో బస్సు లోయలోకి దూసుకెళ్లింది. రోడ్డుపై ఉన్న చెట్ట కొమ్మను తప్పించే సమయంలో బైక్ అడ్డురావడంతో బస్సు ప్రమాదానికి గురైంది. చోడవరం నుంచి పాడేరు వెళ్తుండగా మూల మలుపు వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆర్టీసీ బస్సులో 30 మంది ఉన్నారు.