మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి..

మధురవాడ నారాయణ పాఠశాలలో విద్యార్థినిపై అత్యాచారం చేసి గర్భవతి కావడానికి కారణమైన పీటీ టీచర్ ను కఠినంగా శిక్షించాలని మహిళా చేతన సంస్ద డిమాండ్ చేసింది.

Update: 2024-02-26 12:52 GMT

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: మధురవాడ నారాయణ పాఠశాలలో విద్యార్థినిపై అత్యాచారం చేసి గర్భవతి కావడానికి కారణమైన పీటీ టీచర్ ను కఠినంగా శిక్షించాలని మహిళా చేతన సంస్ద డిమాండ్ చేసింది. సంస్థ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సి.రమణీ కుమారి, కె.పద్మ సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, విద్యాసంస్థలతో నిబంధనల ప్రకారం లైంగిక వేధింపుల నిరోధక కమిటీలను నియమించక పోవడం కూడా సమస్య కు కారణమేనని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఆ దుస్సంఘటన పై విచారణ జరిపించి నారాయణ పాఠశాల యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.సెక్స్ చేయడానికి పనికిరాకుండా చేస్తారు. విదేశాల్లో ఇలాంటివి జరిగితే జీవితంలో సెక్స్ చేయడానికి పనికిరాకుండా చేస్తారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ.పాల్ అన్నారు. ఆయన విశాఖలో విలేకరులతో మాట్లాడుతూ, తాను ఎంపీగా వైజాగ్ లో గెలిస్తే ఇలాంటివి జరగకుండా చూస్తానని చెప్పారు. ఢిల్లీ లో అయితే బస్సులో రేప్ లు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఇటువంటి ఘటనల పై మౌనంగా వుంటున్నారని ఆరోపించారు.


Similar News