Visakha: టౌన్ ప్లానింగ్ అధికారులకు పదోన్నతులు

పట్టణ ప్రణాళిక విభాగంలో పలువురు అధికారులకు పదోన్నతులు కల్పించారు..

Update: 2023-08-27 13:39 GMT

దిశ, ఉత్తరాంధ్ర: పట్టణ ప్రణాళిక విభాగంలో పలువురు అధికారులకు పదోన్నతులు కల్పించారు. అంతేకాదు వివిధ ప్రాంతాలకు బదిలీ చేశారు. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి డిప్యూటీ డైరెక్టర్ల హోదాతో పదోన్నతి కల్పించి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్‌లో అసిస్టెంట్ సిటీ ప్లానర్‌గా పని చేస్తున్న కే వెంకటేశ్వరరావును విఎంఆర్డీఏకు ప్లానింగ్ ఆఫీసర్‌గా బదిలీ చేశారు. మరో అసిస్టెంట్ సిటీ ప్లానర్‌గా పని చేస్తున్న కె జయరాంను విశాఖపట్నంలోని రీజినల్ డిప్యూటీ డైరెక్టర్‌గా నియమించారు. గాజువాక ఏసీపీగా పని చేస్తున్న సంపూర్ణ మహాపాత్రను బొబ్బిలి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీకి బదిలీ చేయగా, అనకాపల్లి ఏసీపీగా పని చేస్తున్న అరుణవల్లిని రాజమండ్రి రీజినల్ డిప్యూటీ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. ఇక జీవీఎంసీలో టీపీవోలు‌గా పని చేస్తున్న శ్రీలక్ష్మి, రామకృష్ణలకు అసిస్టెంట్ విశాఖ సిటీ ప్లానర్ హోదా కల్పిస్తూ పదోన్నతి కల్పించి జీవీఎంసీలోనే పోస్టింగ్ ఇచ్చారు. వీరితో పాటు మరో ఇద్దరు జీవీఎంసీకి రానున్నారు. బొబ్బిలిలో పని చేస్తున్న ఎస్.వెంకటేశ్వరరావు ఏసీపీగా పదోన్నతి కల్పించి జీవీఎంసీలో నియమించగా, నందిగామలో పని చేస్తున్న ఝాన్సీ రాణిని ఏసీపీగా పదోన్నతి కల్పించి జీవీఎంసీలో పోస్టింగ్ ఇచ్చారు. 


Similar News