ప్రధాని మోడీ ఏపీ పర్యటన వాయిదా..?

Update: 2024-02-25 17:33 GMT

దిశ, వెబ్ డెస్క్: ప్రధాని మోడీ ఏపీ పర్యటన వాయిదా పడినట్లు తెలుస్తోంది. ప్రధాని మోడీ మార్చి 1 విశాఖలో పర్యటించాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల మోడీ పర్యటన వాయిదా పడినట్లు సమాచారం. మార్చి 1న విశాఖలో హెచ్‌పీసీఎల్ ఆధునీకరణ ప్రాజెక్టును ప్రధాని మోదీ ప్రారంభించండంతో పాటు ఏయూలో భారీ బహిరంగ సభకు జిల్లా యంత్రాంగంతో పాటు రాష్ట్ర బీజేపీ నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే కొన్ని కారణాలతో మోదీ పర్యటన రద్దయినట్లు సమాచారం అందడంతో ఆ పనులు నిలిపివేసినట్లు తెలుస్తోంది. అయితే మోడీ పర్యటన రద్దు అయినట్లు అధికారిక ప్రకటన రాలేదని విశాఖ అధికారులు చెబుతున్నారు. 

కాగా విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార ప్రయోగశాలను భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆదివారం జాతికి అంకితం చేశారు. పెదవాల్తేరు ఇ.ఎన్.టి ఆసుపత్రి ప్రాంగణంలోని ప్రాంతీయ ప్రజారోగ్య ప్రయోగశాలలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార ప్రయోగ శాల ప్రారంభోత్సవ కార్యక్రమం గుజరాత్ రాష్ట్రంలోని రాజ్ కోట్ నుంచి వర్చువల్ విధానంలో ప్రధాని జాతికి అంకితం చేశారు.

ఈ సందర్బంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా అనేక కార్యక్రమాల్ని అమలు చేస్తున్నామని అన్నారు. అందులో భాగంగా పలు రాష్ట్రాల్లో పలు కార్యక్రమాలతో పాటు ఇటీవల ఆంధ్ర రాష్ట్రంలోని విశాఖలో ఐఐఎం, నేడు కడప, మంగళగిరి ప్రాంతాల్లో ఎయిమ్స్, విశాఖలో ఆహార ప్రయోగశాల వంటివి ప్రారంభించుకోవడం జరిగిందని తెలిపారు.


Similar News