విశాఖలో న్యూ ఇయర్ సందర్భంగా పోలీసుల ఆంక్షలు
ఈ రోజు రాత్రి దేశవ్యాప్తంగా న్యూయర్ వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.
దిశ, వెబ్ డెస్క్: ఈ రోజు రాత్రి దేశవ్యాప్తంగా న్యూయర్ వేడుకలు(Newer celebrations) అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఇందుకోసం యువత, విద్యార్థులు పెద్ద మొత్తంలో ముందస్తు ప్రణాళికలు రూపొందించుకొని మరి.. ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే గతంలో జరిగిన వివిధ సంఘటనలను దృష్టిలో పెట్టుకున్న విశాఖ పోలీసులు(Visakha Police).. ఈ న్యూయర్ వేడుకలపై ఆంక్షలు విధించారు. ఇందులో భాగంగా రాత్రి ఒంటిగంట వరకే హోటళ్లు, పబ్‌లకు అనుమతి ఉందని.. సమయం ముగిసిన వెంటనే మూసివేయాలని సూచించారు. అలాగే నగరంలోని పలు కీలక ప్రాంతాల్లో.. ఈ రోజు రాత్రి 8 గంటల నుంచి రేపు ఉ.5 వరకు ట్రాఫిక్ ఆంక్షలు(Traffic restrictions) విధించారు.
దీంతో పాటుగా.. ఆర్టీసీ కాంప్లెక్స్ అండర్‌పాస్ వే సహా.. తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌ను పోలీసులు మూసివేయనున్నారు. అలాగే మద్యం సేవించి రోడ్లపై విచ్చల విడిగా వాహనాలు నడపడం, న్యూసెన్స్ చేయడం వంటివి జరగకుండా ఉండేందుకు ఈ రోజు రాత్రి మొత్తం.. ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. విశాఖ బీచ్ రోడ్డు(Visakha Beach Road)లో ర్యాష్ డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవ్‌పై ఫోకస్ పెట్టారు. అలాగే.. న్యూయర్ వేడుకల్లో భాగంగా సముద్ర తీరానికి వచ్చే మహిళలకు రక్షణ కల్పించేందుకు, ఆకతాయిల ఆటలు అరికట్టేందుకు.. ఆర్కే బీచ్(RK Beach) సహా పలుచోట్ల షీ టీమ్స్(She teams)తో నిఘా ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.