Visakha: చైనాతో సంబంధాలు.. బెట్టింగ్ ముఠా అరెస్ట్.. వివరాలివే..!
విశాఖలో బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు..
దిశ, వెబ్ డెస్క్: విశాఖలో బెట్టింగ్ ముఠాలు రెచ్చిపోతున్నాయి. విదేశాలతో సంబంధాలు పెట్టుకుని యాపులు నిర్వహిస్తు్న్నాయి. అహ్మదాబాద్ నుంచి విశాఖలో బెట్టింగులు కడుతున్నాయి. క్రికెట్‌తో పాటు పలుగేముల్లో బెట్టింగ్‌లు నిర్వహిస్తూ సైబర్ క్రైములకు పాల్పడుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ నుంచి అనుమతి లేకుండానే వివిధ బెట్టింగ్ యాప్‌లు నిర్వహిస్తున్నాయి. అమాయక యువకులే టార్గెట్‌గా డబ్బులు కొట్టేస్తున్నాయి. అనంతరం చైనా, తైవాన్‌లకు పంపుతున్నాయి. పక్కాగా సమచారం అందుకున్న పోలీసులు బెట్టింగ్ ముఠాపై దాడి చేశారు. ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
విశాఖ కేంద్రంగా బెట్టింగ్ యాప్ పేరిట సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. డెబిట్ కార్డులు, 700 బ్యాంకుల చెక్‌బుక్‌లు, 9 ల్యాప్‌టాప్‌లు, 1 డెస్క్‌టాప్, 8 సీపీయూలు, మూడు బంగారు ఉంగరాలు, 65 ఫోన్లు, కారు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు విశాఖ పోలీస్ కమిషనర్ శంక బత్ర బాగ్చి కేసు వివరాలు వెల్లడించారు.