స్టీల్ ప్లాంట్ కోసం ప్రధాని కాళ్లు పట్టుకోవడానికి సిద్ధం: Pawan Kalyan
విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సొంతగనులు సాధించేందుకు అవసరమైతే ప్రధాని కాళ్లు పట్టుకోడానికి తాను సిద్ధమేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు...
దిశ, వెబ్ డెస్క్: విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సొంతగనులు సాధించేందుకు అవసరమైతే ప్రధాని కాళ్లు పట్టుకోడానికి తాను సిద్ధమేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రహోంమంత్రి అమిత్ షాతో మాట్లాడానని ఆయన స్పష్టం చేశారు. చేతకాని వారిని గెలిపించి రాష్ట్ర భవిష్యత్తును ప్రశ్నార్ధకం చేసుకోవద్దన్నారు. గంగవరం పోర్టుకు సంబంధించి ప్రజల ఆస్తి 10 శాతాన్ని కూడా జగన్ ప్రభుత్వం అమ్మకం చేసేయడం దారుణమన్నారు. గంగవరం మత్స్యకారులకు న్యాయం చేయకుండా విశాఖ రాజధాని చేసి ఏమి సాదిద్దామనుకుంటున్నారని ప్రభుత్వాన్ని పవన్ ప్రశ్నించారు. మరో ఆరు నెలల పాటు జగన్ ప్రభుత్వాన్ని భరించాల్సిందేనన్నారు. ఆ తర్వాత జనసేనను గెలిపిస్తే విశాఖ గాజువాక ప్రజలకు అండగా నిలుస్తానని పవన్ వ్యాఖ్యానించారు.
రాజకీయంగా తనను ఎదుర్కోలేక తన తల్లి, భార్య పిల్లలపై మాట్లాడడం వైసీపీ ప్రజాప్రతినిధులకు ఎంత మాత్రం సమంజసం కాదని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. విశాఖలోని దస్పల్లా భూములు, సిరిపురం భూములు ఋషికొండ భూములు దోపిడీకి గురవుతున్నాయన్నారు. లక్ష కోట్లకు పైగా ఆస్తులు ఆంధ్రాకు రావాల్సిన తెలంగాణలో ఇంకా ఉన్నాయన్నారు. ఎందుకు పరిష్కార దశగా ఈ ప్రభుత్వం ఆలోచన చేయటం లేదని పవన్ ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం పాలనలో పోలీస్ శాఖ కూడా విసిగిపోతుందని, వారాంతపు సేవలు ఇస్తామని ఇంతవరకు అమలు చేయలేదని విశాఖ గాజువాకలో నిర్వహించిన బహిరంగం సభలో పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.