Paderu to Keral: 130 కిలోల గంజాయి తరలిస్తూ వ్యక్తి అరెస్ట్
విశాఖపట్నం సమీపం పెందుర్తిలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు...
దిశ, ఉత్తరాంధ్ర: విశాఖపట్నం సమీపం పెందుర్తిలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. కారులో తరలిస్తున్న 130 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నకిలీ నెంబర్ ప్లేటుతో పాడేరు నుంచి కేరళకు కారులో గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కారు లోపల వేరే నెంబర్ ప్లేట్లు ఉండడంతో ప్రాంతాలవారీగా మార్చుకుంటూ వెళుతున్నారని గుర్తించారు. కేరళకు చెందిన నిందితుడు శశి కుమార్‌పై కేసు నమోదు చేసి దర్యా్ప్తు చేస్తున్నారు.