చంద్రబాబు, పవన్ ఫ్లెక్సీలు పెట్టి మెగా మాల్‌ ఆక్రమణలు.. బీజేపీ ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం

విశాఖలో పెరిగిన కబ్జాలపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు..

Update: 2024-12-13 04:33 GMT

దిశ, వెబ్ డెస్క్: విశాఖలో కబ్జాలు పెరిగాయి. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు అక్రమార్కులు వాలిపోతున్నారు. ప్రభుత్వ పెద్దల ఫ్లెక్సీలు పెట్టి కోట్ల విలువైన భూములు కొట్టేస్తున్నారు. ఇలా గతంలో జగన్, విజయసాయిరెడ్డి ఫ్లెక్సీలతో ఆక్రమణలు దర్శనమిచ్చాయి. ఇప్పుడు చంద్రబాబు, పవన్ ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. దీంతో అక్రమార్కులు చూపిస్తున్న అతి తెలివిపై రాష్ట్ర బీజేపీ శాఖ మండిపడుతోంది. విశాఖలో గ్రీన్ బెల్ట్ ఆక్రమణలపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సిటీ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.


మురళినగర్ హైవే దగ్గర మెగా మాల్ నిర్మించారని, చెట్లను తొలగించి గ్రీన్ బెల్ట్‌పై నుంచి నిర్మాణాలు చేపట్టారని, చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాదు ఆ నిర్మాణానికి తన ఫ్లెక్సీలను కూడా పెట్టారని తెలిపారు. మెగామాల్ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు దీంతో జీవీఎంసీ యాక్షన్‌కు దిగింది. పొక్లెయినర్లతో ఆక్రమణలను తొలగిస్తోంది. 


Similar News