అది పిచ్చి పని.. మాజీ సీఎం జగన్‌పై అశోక్ గజపతి రాజు ఫైర్
రుషికొండ భవన నిర్మాణాలు పిచ్చి పని అని కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు ఆరోపించారు...
దిశ, వెబ్ డెస్క్: రుషికొండ భవన నిర్మాణాలు(Rushikonda Buildings) పిచ్చి పని అని ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(Former AP Chief Minister Jagan Mohan Reddy)పై కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు(Former Union Minister and senior TDP leader Ashok Gajapathi Raju) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ భవన నిర్మాణాలతో ప్రజాధనం దుర్వినియోగమైందని ఆయన మండిపడ్డారు. సింహాచలం, ఇతర అనుబంధ ఆలయాలపై విశాఖలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి(Minister Anam Ramanarayana Reddy) సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా అశోక్ గజపతి రాజు మాట్లాడుతూ రుషికొండ భవనాల వినియోగంపై ప్రజాభిప్రాయం తీసుకోవాలని కోరారు. మాన్సాస్ భూముల(Manassas Lands) సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. అమరావతిలో సీఎం చంద్రబాబు(Cm Chandrababu) సచివాలయం నిర్మించారని గుర్తు చేశారు. 2019లో జగన్ వచ్చిన తర్వాత ఏపీ సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టారని ఆరోపించారు. ప్రజా ఆస్తులను తాకట్టు పెట్టే అధికారం వైఎస్ జగన్(Ys Jagan)కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. గత ఐదేళ్లలో సైకో పాలన సాగిందని అశోక్ గజపతి రాజు వ్యాఖ్యానించారు.