ముక్కలై కొట్టుకుపోయిన ఫ్లోటింగ్ బ్రిడ్జిపై.. సోషల్ మీడియాలో కామెంట్స్ వైరల్?
ప్రారంభించిన ఒక్క రోజులోనే ముక్కలై కొట్టుకుపోయిన ఫ్లోటింగ్ బ్రిడ్జి అంశం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 'పనోడు పందిరి వేస్తే పిచ్చుకలు వచ్చి పడగొట్టాయంటూ' బ్రిడ్జి ఫోటోలు, వీడియోలతో సోషల్ మీడియా హోరెత్తిపోయింది.
దిశ ప్రతినిధి విశాఖపట్నం: ప్రారంభించిన ఒక్క రోజులోనే ముక్కలై కొట్టుకుపోయిన ఫ్లోటింగ్ బ్రిడ్జి అంశం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 'పనోడు పందిరి వేస్తే పిచ్చుకలు వచ్చి పడగొట్టాయంటూ' బ్రిడ్జి ఫోటోలు, వీడియోలతో సోషల్ మీడియా హోరెత్తిపోయింది. బ్రిడ్జి తెగిపోలేదని లింకు తీశామని అధికారులు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా జనం ఎవరూ నమ్మలేదు. ఫ్లోటింగ్ బ్రిడ్జి ఏర్పాటు చేసిన విశాఖ వుడా కు జిల్లా కలెక్టర్ కమిషనర్ కావడం 26వ తేదీ నుంచి పర్యాటకులను అనుమతి ఇస్తామని ఆయనే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడు అధికారుల మాటలను ఎవరూ విశ్వసించడం లేదు."అబ్బాయి ప్రారంభించిన బస్ బే గాలికి ఎగిరిపోయింది. బాబాయి రిబ్బన్ కట్ చేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జి అలలకు కొట్టుకుపోయింది. మూడుముక్కలాట బ్యాచ్ పనులన్నీ ఇంతే " అంటూ నేత నారా లోకేష్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ లక్షలాది మందికి చేరింది.
విశాఖలో ఫ్లోటింగ్ బ్రిడ్జి సక్రమంగా కట్టలేని జగన్ గారు రాజధాని కట్టగలిగే సత్తా ఉందంటే ప్రజలు నమ్ముతారా.? విశాఖలో ఇప్పుడు ఫ్లోటింగ్ బ్రిడ్జి కూలింది త్వరలో వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో పేకమేడలా కూలిపోతుంది" అంటూ బీజేపీ నేత లంక దినకర్ చేసిన వ్యాఖ్య వేల మందికి చేరింది.మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అయితే మరో అడుగు ముందుకేసి "ఆర్కే బీచ్ లో సముద్రం పై అలా తేలుతూ నడవచ్చు అనుకుంటే ఒక్క రోజుకే తేలిపోయింది. ఫ్లోటింగ్ బ్రిడ్జిని ఒక్క రోజు వాలిడిటీతో కట్టిన వారి దృఢత్వం నైపుణ్యం ఏమిటో మరోసారి రుజువు చేశారు అంటూ ఎటకారం చేశారు. చిన్న బస్ షెల్టర్, ఫ్లోటింగ్ బ్రిడ్జి సక్రమంగా కట్టలేని వాళ్ళు రాజధాని, పోలవరం కట్టేస్తారంటే జనాలు నవ్వుకుంటున్నారు. జగనన్న ఇక ప్రజలు బై జగన్ బై బై జగన్ వచ్చేసిందంటూ ఆయన తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.