ప్రశాంత్ కిషోర్ సర్వేపై మంత్రి అమర్‌నాథ్ స్ట్రాంగ్ రియాక్షన్

ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ప్రశాంత్ కిషోర్ సర్వే నిజం కాదని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. ..

Update: 2024-03-03 16:15 GMT

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ప్రశాంత్ కిషోర్ సర్వే నిజం కాదని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. ఏపీ ఎన్నికలపై ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.   ఆదివారం రాత్రి విశాఖలో విలేకరులతో మాట్లాడుతూ ఒక పీకే సరిపోడని, రెండో పీకేని తెచ్చుకున్నారని మంత్రి అమర్‌నాథ్ ఎద్దేవా చేశారు. ప్రశాంత్ కిషోర్‌తో చంద్రబాబు రెండు మూడు గంటలు భేటీ అయ్యారని తెలిపారు. చంద్రబాబు, పీకే చెల్లని రూపాయలని విమర్శించారు. బీహార్‌లో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా? అని ప్రశ్నించారు. గతంలో సంక్షేమం లేదని, అభివృద్ధి లేదని అన్నారు. పీకే సర్వేలు ప్రజలు నమ్మరని మంత్రి అమర్‌నాథ్ కొట్టిపారేశారు. 

కాగా వచ్చే ఎన్నికల్లో ఏపీలో విజయంపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతే విజయమని తేల్చేశారు. వైఎస్ జగన్ ఓటమి తప్పదని స్పష్టం చేశారు. సీఎం జగన్ ప్యాలెస్‌లో కూర్చుకుని పథకాల పేరుతో డబ్బులు ఇస్తున్నారని.. దాని వల్ల ఓట్లు పడవని వెల్లడించారు. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా ఉండాలని చెప్పారు. ఏపీలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. జగన్ ఈసారి ఏం చేసినా గెలవడం కష్టమని చెప్పారు. హైదరాబాద్‌లో జరిగిన పత్రిక కాంక్లేవ్‌లో పాల్గొన్న ప్రశాంత్ కిషోర్.. ఏపీ ఎన్నికలపై స్పందించారు.


Similar News