Breaking: సీఎం జగన్ బాటలో పవన్.. ఫస్ట్ లిస్ట్ విడుదల

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమ పార్టీ సమన్వయకర్తలను ప్రకటించారు.

Update: 2024-02-19 10:31 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. అంతేకాదు పోటీ అభ్యర్థుల కసరత్తు ముమ్మరం చేశాయి. ఇప్పటికే సీఎం జగన్ ఏడు విడుతల్లో ఇంచార్జుల జాబితాలను విడుదల చేశారు. అటు టీడీపీ సైతం పలువురిని ఇంచార్జుల నియమించింది. తాజాగా వైసీపీ, టీడీపీ బాటలోకి జనసేన కూడా వచ్చి చేరింది. టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్లానన్న జగసేన అధినేత పవన్ కల్యాణ్ అభ్యర్థుల ఖరారుపై క్లారిటీ ఇవ్వలేదు. అంతేకాదు అభ్యర్థులను ఖరారు చేసే వరకు ఆయా నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎంపిక చేశారు. భీమిలీ నియోజకవర్గం జనసేన సవన్వయకర్తగా వంశీకృష్ణ శ్రీనివాస్ నియామకం అయ్యారు. గాజువాక- సుందరపు సతీశ్, పెందుర్తి- పంచకర్ల రమేశ్, ఎలమంచిలి జనసేన సమన్వయ కర్తగా సుందరపు విజయ్ కుమార్‌ను జనసేన పార్టీ నియమించింది. అభ్యర్థులను ప్రకటించేందుకు వీరు ఆయా నియోజకరవర్గాలకు సమన్వయకర్తలుగా పని చేయనున్నారు.


Similar News