151 మంది ఎమ్మెల్యేలతో ఒరగబెట్టిందేమీలేదు: Pawan Kalyan
ప్రజలకు మంచి చేయాలనే లక్ష్యంతో రాజకీయాలోకి వచ్చానని, జనసేన ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళతానని పవన్ కల్యాణ్ అన్నారు. ...
దిశ , వెబ్ డెస్క్: ప్రజలకు మంచి చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చానని, జనసేన ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళతానని పవన్ కల్యాణ్ అన్నారు. వారాహి యాత్ర సందర్భంగా గాజువాకలో బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలను గెలుచుకున్న వైసీపీ ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. అవినీతి, అక్రమాలు, భూకబ్జాలకు పాల్పడుతూ రాజ్యమేలుతున్న వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని పవన్ పిలుపునిచ్చారు. గంగవరం పోర్టు నిర్మాణం వల్ల ఉపాధి కోల్పోయిన మత్స్యకారులకు యాజమాన్యం ఉపాధి చూపించకుండా ఇబ్బందులకు గురి చేస్తోందని చెప్పారు. తన తుది శ్వాస వరకు ప్రజలతోనే ఉంటానన్నారు. జనసేన పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చే బాధ్యత ప్రజలేదనని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.