జగన్ ను నమ్ముకొంటే గంజి మెతుకులే గతి.. మహిళల వినూత్న నిరసన

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను నమ్ముకుంటే కష్టాలు, కన్నీళ్లే అంటూ విశాఖ తెలుగుదేశం కార్యాలయంలో గురువారం తెలుగు మహిళలు నిరసన తెలియజేశారు.

Update: 2024-02-22 12:00 GMT

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను నమ్ముకుంటే కష్టాలు, కన్నీళ్లే అంటూ విశాఖ తెలుగుదేశం కార్యాలయంలో గురువారం తెలుగు మహిళలు నిరసన తెలియజేశారు. జగన్ ను ఎందుకు నమ్మాలి అని ఫ్లెక్సీ ఏర్పాటు చేసి నిరసన తెలియజేశారు. మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి అయితే ప్రజలకు గంజి అన్నలే గతి అని గంజి అన్నం తింటూ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా విశాఖ పార్లమెంట్ తెలుగు మహిళ అధ్యక్షురాలు అనంతలక్ష్మి మాట్లాడుతూ.. పేదవాడి బతుకులను సీఎం జగన్ నాశనం చేశారని ఆరోపించారు. రాష్ట్రాన్ని ,కుటుంబాలని అప్పులపాలు చేసిన జగన్ ను ఎందుకు నమ్మాలని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయని, రాష్ట్ర ప్రజలు గంజి అన్నం తినడానికి సిద్ధంగా లేరని జగన్ ను ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. రాష్ట్రానికి పట్టిన శని సీఎం జగన్ అని రానున్న ఎన్నికల్లో జగన్ మా నమ్మకం కాదని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.

Read More..

వైసీపీ వైపు మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ .. రెండు రోజుల్లో క్లారిటీ  


Similar News