న్యాయవాదులకు సబ్సిడీ ధరలకు ఇళ్ల స్ధలాలు..

న్యాయవాదులకు సబ్సిడీ ధరలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే ఆలోచనను వైఎస్సార్ కాంగ్రెస్ చేస్తుందని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.

Update: 2024-03-17 15:28 GMT

దిశ ప్రతినిధి, విశాఖపట్నం:న్యాయవాదులకు సబ్సిడీ ధరలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే ఆలోచనను వైఎస్సార్ కాంగ్రెస్ చేస్తుందని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.విశాఖపట్నం ఉడా చిల్డ్రన్ థియేటర్ లో ఆదివారం జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయ విభాగం ఉత్తరాంధ్ర జిల్లాల సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమాజంలో లాయర్ పాత్ర మరువలేనిది.ఆ వాస్తవాన్ని గుర్తించే ముఖ్యమంత్రి జగన్ యువ న్యాయవాదుల కోసం లా నేస్తం పథకాన్ని తీసుకువచ్చారని చెప్పారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, విశాఖ ఎంపీ ఎం వీ వీ సత్యనారాయణ, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, జోనల్ ఇన్చార్జిలు మహేశ్వర రెడ్డి, వాసుదేవ రావు, వైఎస్సార్ కాంగ్రెస్ విశాఖ లోక్ సభ అభ్యర్థి బొత్స ఝాన్సీ, విశాఖ ఉత్తర అభ్యర్థి కే కే రాజు, వి ఎం ఆర్ డీ ఏ చైర్మన్ సనపల చంద్రమౌళి, సంఘం నేతలు గణేష్, అంజనీ కుమార్, ఎం ఏ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


Similar News