మంత్రి బొత్స ఫ్యామిలీలో నలుగురికి సీట్లు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అసెంబ్లీ, పార్లమెంటు సీట్లలో మంత్రి బొత్స కుటుంబంలో నలుగురికి అవకాశం దక్కింది..

Update: 2024-03-16 16:20 GMT

దిశ ప్రతినిధి,విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శనివారం ప్రకటించిన అసెంబ్లీ, పార్లమెంటు సీట్లలో విజయనగరం జిల్లాకు చెందిన రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబానికి నాలుగు సీట్లు దక్కాయి. వైఎస్సార్ కాంగ్రెస్‌లో ఒకే కుటుంబానికి నాలుగు టికెట్‌లు దక్కడం రికార్డే. బొత్స సత్యనారాయణ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లి నియోజకవర్గ అసెంబ్లీ టికెట్ నిలబెట్టు కొన్నారు. ఆయన సోదరుడు బొత్స సోదరుడు బొత్స అప్పల నరసయ్య గజపతి నగరం, దగ్గర బంధువు బడి కొండ అప్పల నాయుడు నెల్లిమర్ల సీట్లను నిలబెట్టు కొన్నారు. కొత్తగా బొత్స సత్యనారాయణ భార్య బొత్స ఝాన్సీకి విశాఖపట్నం లోక్ సభ సీటు దక్కింది. బొత్స మేనల్లుడు చిన్న శ్రీను విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్‌గా వున్నారు. బడి కొండ అప్పల నాయుడుకు శ్రీను వియ్యంకుడు కూడా. కుటుంబంలో ఎక్కువ టికెట్లకు ఇవ్వకూడదనే వైఎస్సార్ కాంగ్రెస్ పాలసీకి విరుద్ధంగా బొత్స సత్యనారాయణ కుటుంబానికి సీట్లు దక్కడం విశేషం.


Similar News