Fengal Cyclone: తుపాన్ ఎఫెక్ట్‌.. విశాఖ నుంచి పలు విమానాలు రద్దు

తీరందాటిన ఫెయింజల్ తుపాన్ (Fengal Cyclone) ప్రభావం ఏపీ, తమిళనాడు రాష్ట్రాలపై కనిపిస్తోంది. బలహీన పడుతున్న తుపాను ప్రభావంతో.. భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Update: 2024-12-01 07:01 GMT

దిశ, వెబ్ డెస్క్: తీరందాటిన ఫెయింజల్ తుపాన్ (Fengal Cyclone) ప్రభావం ఏపీ, తమిళనాడు రాష్ట్రాలపై కనిపిస్తోంది. బలహీన పడుతున్న తుపాను ప్రభావంతో.. భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలో నిన్న సాయంత్రం నుంచి కుండపోత వర్షాలు కురుస్తుండగా.. ఎయిర్ పోర్టులోకి నీరు చేరింది. రన్ వే పై వర్షపు నీరు భారీగా నిలిచిపోవడంతో.. అధికారులు విమానాల రాకపోకలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఏపీలోనూ వివిధ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో.. విశాఖపట్నం నుంచి పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి.

తిరుపతిలోనూ భారీ వర్షాలు కురుస్తుండటంతో విశాఖ నుంచి తిరుపతికి వెళ్లే విమానాలను తాత్కాలికంగా రద్దు చేశారు ఎయిర్ పోర్టు అధికారులు. అలాగ చెన్నైలోనూ తుపాను ప్రభావం ఉండటంతో.. విశాఖ నుంచి చెన్నైకు వెళ్లే విమాన సర్వీసుల్నీ క్యాన్సిల్ చేశారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా విమానాలు రద్దు చేశామని, ప్రయాణికులు సహకరించాలని ఎయిర్ పోర్టు అధికారులు కోరారు. 

Tags:    

Similar News