విశాఖలో మరో దారుణం.. యువతికి కానిస్టేబుల్ వేధింపులు
బాలికపై గ్యాంగ్ రేప్ ఘటన జరిగి కొన్ని గంటలు కూడా గడవక ముందే మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ..
దిశ, వెబ్ డెస్క్: బాలికపై గ్యాంగ్ రేప్ ఘటన జరిగి కొన్ని గంటలు కూడా గడవక ముందే మరో దారుణం వెలుగులోకి వచ్చింది. అది కూడా ఓ కానిస్టేబుల్ వేధింపులు. పెదగంట్యాడ న్యూ పోర్టు పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న రాము శారీరకంగా, మానసికంగా ఓ యువతిని వేధింపులకు గురి చేశారు. ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువతికి తనకు పెళ్లికాలేదని చెప్పారు. దాంతో కొద్ది రోజులు ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ నడిచింది. అయితే రాముకు పెళ్లి అయిందని యువతికి తెలియడంతో అతన్ను దూరం పెట్టారు. దీంతో యువతిని రాము వేధించడం మొదలుపెట్టారు. అయినా భరించింది. ఈ వేధింపులు మరీ ఎక్కువకావడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విశాఖ సీపీ విచారణ జరపడంతో యువతిని కానిస్టేబుల్ రాము వేధించినట్లు నిర్ధారణ అయింది. దీంతో కానిస్టేబుల్ రామును సీపీ సస్పెండ్ చేశారు.